* భారత్ లో మే 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది
* ఏపీలో ఉన్న వలస కూలీలందరినీ వారి సొంత రాష్ట్రాలకు తరలించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది
* దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీలను తరలించడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోరారు
* ధిల్లీలో మఖాం వేసిన వలస కూలీలను కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ పరామర్శించారు
* విజయవాడా సమీపంలోని రాయనపాడులోని సెంట్రల్ స్కూల్ లో 1600 మంది వలస కూలీలకు పునరావాస కేంద్ర ఏర్పాటు చేశారు. వీరంతా అస్సాం, మేఘాలయ, మణిపూర్ కు వెళ్ళే కూలీలు
* దళిత వైద్యుడు డా. సుధాకర్ పై దాడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు
* పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో విషయంలో జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్దిస్తునట్లు కడప జిల్లా టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తెలిపారు
* విద్యుత్ బిల్లుల పై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని కదిరి ఎమెల్యే డా.పీవీ సిద్దారెడ్డి మండిపడ్డారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండానే జూన్ 30 వరకు కరంట్ బిల్లులు చెల్లించవచ్చని పేర్కొన్నారు
* హనుమాన్ జయంతి సందర్భంగా ఇంద్రకీలాద్రి పై క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు నిర్వహించారు
* ఏపీలో గత 24 గంటల్లో 25 కేసులు నమోదు. 1433 మంది డిశ్చార్జి, 747 యాక్టివ్ కేసులు
* కడప గండి క్షేత్రంలో నిరాడంబరంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు
* ఈ రోజు ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్ధిక ప్యాకేజీ-4 వివరాలను వెల్లడించారు
* ఆదివారం అమెరికాలోని చికాగో నుండి రానున్న తొలి విమానంలో ప్రవాసాంధ్రులు 33 మంది శంషాబాద్ విమానాశ్రయంలో దిగేందుకు తెలంగాణా ప్రభుత్వం అనుమతించింది
* ఓడిశా వైపుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఇది ఆదివారం నుండి తీవ్రరూపం దాల్చనుంది
* ఎక్సైజ్ ఉద్యోగులను విభజించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఎక్సైజ్ కు 30 శాతం, ‘ఎస్ ఈ బీ’ లకు 70 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో పంచాయితీ, కార్పొరేషన్ ఎన్నికలు పూర్తిగా రద్దు.రెండు, మూడు రోజుల్లో కేంద్ర ఎన్నికల కమిషనర్ జారీ చెయనున్నట్లు సమాచారం
ఏపీ ఎక్సైజ్ ఉద్యోగుల విభజన పూర్తి-తాజావార్తలు-05/17
Related tags :