DailyDose

మే31 వరకు లాక్‌డౌన్ పొడిగింపు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - India Extends Lockdown Until 31st

* భారత్‌లో లాక్ డౌన్ కొనసాగింపు. మరో 14 రోజులు లాక్ డౌన్ కొనసాగిస్తూ హోమ్ శాఖ ఉత్తర్వ్యులు. ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగింపు. కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ 4.0 లో వీటిపై నిషేధం కొనసాగుతుంది

* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. దేశీయంగా మెడికల్‌ సేవలు, దేశీయ ఎయిర్‌ అంబులెన్స్‌లు, భద్రతకు సంబంధించినవి, ఎంఏహెచ్‌ అనుమతించిన వాటికి మినహాయింపు ఉంటుంది.

* మెట్రో రైలు సేవలు

* పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్‌ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్‌లైన్‌/డిస్టెన్స్‌ లెర్నింగ్‌ ఎప్పటిలాగే కొనసాగుతుంది.

* హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర సేవలకు అనుమతి లేదు. అయితే, వైద్య, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, హెల్త్‌కేర్‌ వర్కర్లలకు సేవలందించే, క్వారంటైన్‌లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించే వాటికి అనుమతి ఉంటుంది.

* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, ఇతర వినోద ప్రాంతాలు తెరిచేందుకు అనుమతి లేదు.

* రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకూ అనుమతి లేదు.

* మతపరమైన సంస్థల్లో ప్రజలకు అనుమతి లేదు. మతపరమైన ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించడానికి లేదు.

* గుజ‌రాత్ రాష్ట్రం అహ్మదాబాద్ న‌గ‌రం‌లో నిత్యావసర సరుకులు, కూరగాయలు అమ్ముకునేవారిలో 700 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. అహ్మ‌దాబాద్ అధికారులు ప్ర‌త్యేకించి నిత్యావ‌స‌రాలు అమ్ముకునే వారికి వారం రోజుల‌పాటు భారీ స్థాయిలో క‌రోనా నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

* దేశంలో 80 శాతం కరోనా కేసులు 12 రాష్ర్టాల్లోని 30 మున్సిపాలిటీల్లోనే నమోదవుతున్నాయి. దీంతో ఆ మున్సిపాలిటీల్లోని ఓల్డ్‌ సిటీలు, మురికివాడలు, వలస కూలీల శిబిరాలు, అత్యధిక జనసాంద్రత ఉండే ప్రాంతాల్లో అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం మున్సిపల్‌ అధికారులను ఆదేశించింది.

* విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు. కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ వల్ల విద్యార్థులకు చదువు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. విద్యా రంగంలో ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం అందిస్తామన్నారు. విద్యా రంగం కోసం మరో 12 స్వయం ప్రభ ఛానళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

* ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై చేస్తున్న పోరులో మత పెద్దలు కీలక పాత్ర పోషించవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. మహమ్మారి ప్రభావానికి గురైన ప్రజలు తిరిగి కోలుకోవడంలో మత పెద్దల పాత్ర ఎంతో కీలకమన్నారు. స్థిరమైన, సమానమైన ప్రపంచాన్ని నిర్మించడంలో వివిధ వర్గాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని గుటెర్రస్‌ స్పష్టం చేశారు. ఈ సమయంలో వైరస్‌పై విస్తృత అవగాహన కలిపించడమే కాకుండా దీనిద్వారా త్వరగా కోలుకునే మార్గాలను ప్రజలకు వివరించడంలో మత పెద్దలు కీలకమని గుటెర్రస్‌ ట్విటర్‌లో ద్వారా పేర్కొన్నారు.

* తమిళనాడులో ఈ రోజు 639 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,224కి పెరిగింది. గత 24 గంటల్లో నలుగురు మృతి చెందగా… మొత్తం మృతులు 78 మంది. ఈ రోజు డిశ్చార్జి అయిన 634 మందితో కలిపితే మొత్తం 4,172 మందికి నయమైంది. మిగిలిన 6,971 మంది చికిత్స పొందుతున్నారు. చెన్నైలో ఈ రోజు 482 కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 6,750కు చేరింది.

* కేరళలో ఈ రోజు 14 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం… రాష్ట్రంలో మొత్తం యాక్టివ్‌ కేససుల సంఖ్య 101కి చేరింది.

* దేశీయ విమాన సర్వీసులు త్వరలో ప్రారంభమవుతాయంటూ వార్తలొచ్చాయి. అయితే ఎప్పుడనే విషయంలో స్పష్టత లేదు. తాజాగా ఈ విషయంలో ఎయిరిండియా స్పందించింది. ‘‘ఎయిరిండియా విమానాల బుకింగ్ ఇంకా ప్రారంభించలేదు. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాక ప్రారంభిస్తాం’’ అని ఎయిరిండియా సమాచారమిచ్చింది.