హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఛార్మి. ఇప్పుడు నిర్మాతగా మారారు. పూరీ జగన్నాథ్‌తో కలిసి నిర్మాతగా మారి ఇస్మార్ట్ శంకర్ సినిమాను నిర్మించింది ఛార్మి. ఇప్పుడు రొమాంటిక్ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ సినిమాను కూడా నిర్మిస్తోంది. పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఛార్మి మాట్లాడుతూ ‘‘ఇకపై సినిమాల్లో నేను నటించను. చాలా మంది కొత్త హీరోయిన్స్ వస్తున్నారు. మంచి ప్రతిభను కనపరుస్తున్నారు. ఈ సమయంలో నేను నటిగా నటించాలనుకోవడం లేదు. జ్యోతిలక్ష్మీ సమయంలో నటిగా రిటైర్‌మెంట్ ప్రకటిద్దామని అనుకున్నాను. అయితే పూరి, కల్యాణ్‌గారి సలహాతో దాన్ని బహిరంగంగా ప్రకటించలేదు’’ అన్నారు.
కొత్త ప్రతిభ బాగుంది
Related tags :