కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, ఒత్తిడులు ఎదుర్కోవడం తద్వారా పటిష్ఠవంతమైన ఆర్థిక స్వావలంబన సాధించడం అనే అంశాలపై నాట్స్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో వెబినార్ నిర్వహించారు. వర్జీనియాకు చెందిన ఆర్థిక నిపుణుడు వేగేశ్న రామకృష్ణరాజు ఈ వెబినార్‌లో ప్రసంగించారు. అన్నే శేఖర్(డాలస్ నాట్స్), శిష్ట్లా నాగ(సెయింట్ లూయిస్ నాట్స్), నాట్స్ డైరెక్టర్ సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, సతీష్ చిట్టినేని(ర్యాలీ నాట్స్) తదితరులు ఈ వెబినార్ నిర్వహణకు సహకరించారు. నాట్స్ సభ్యులకు TAXFILEASSIST ద్వారా 10శాతం రాయితీ ఇస్తున్నట్లు రాజు తెలిపారు. వెబినార్ నిర్వాహకులను నాట్స్ చైర్మన్ అప్పసాని శ్రీధర్, అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబులు అభినందించారు.
కరోనా సమయంలో ఆర్థిక ఒత్తిడులపై నాట్స్ వెబినార్
Related tags :