* గత నాలుగు రోజుల క్రితం మంగళగిరి పరిధిలోగల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నందు ఆత్మహత్య ప్రయత్నం చేసిన నరసింహారెడ్డి అనే కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఈ ఎస్ ఓ బాలకిషన్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
* విజయవాడ ఎంబి భవన్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అరెస్ట్.
* జేపి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేస్తున్న కార్మికులు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామం. ఐదు నెలలు గా జీతాలివ్వని వైనం.
* లాక్ డౌన్లో కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ అర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
* బీజేపీ మాజీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కామెంట్స్..నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ పై పోలీసులు తీరు సరికాదు. ఘటనపై ప్రభుత్వం విచారణ చేయాలి.
* మచిలీపట్నం మడ అడవుల నరికివేతపై హైకోర్టులో పిటిషన్. వీడియో కాన్ఫిరెన్సు ద్వారా పిటిషన్ పై ధర్మాసనం విచారణ. మడ అడవులు నరికి పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీకి శ్రీకారం చుట్టిందని పిటిషన్ వేసిన ఇద్దరు మత్సకారులు. మడ అడవి కొట్టివేయడం చట్ట విరుద్ధమని ధర్మాసనానికి వివరించిన పిటిషనర్ తరుపు న్యాయవాది తిరుమాని విష్ణుతేజ.
* విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభావిత గ్రామాల బాధితులతో క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.
* పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న పరీక్షలకు సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసింది సీబీఎస్ఈ.జులై 1 నుంచి 15 తేదీ మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది.పదో తరగతి పరీక్షలుజులై 1: సోషల్ సైన్సెస్జులై 2: సైన్స్జులై 10: హిందీ (ఏ, బీ)జులై 15: ఆంగ్లం ( రెండు భాగాలు)12వ తరగతి పరీక్షలుజులై 1: హోమ్ సైన్స్జులై 2: హిందీ (ఏ, బీ)జులై 9: బిజినెస్ స్టడీస్జులై 10: బయోటెక్నాలజీజులై 11: జాగ్రఫీకరోనా కట్టడి కోసం మార్చి 25న విధించిన లాక్డౌన్ నేపథ్యంలో 12వ తరగతికి చెందిన కొన్ని పరీక్షలను నిలిపేశారు.10వ తరగతి పరీక్షలు ఇప్పటికే పూర్తయినా సీఏఏ అల్లర్ల కారణంగా ఈశాన్య దిల్లీలో వాయిదా పడ్డాయి.ప్రస్తుతం 12వ తరగతి పరీక్షలతో పాటు వీటిని నిర్వహించనుంది సీబీఎస్ఈ బోర్డు.
* మహారాష్ట్ర శాసనమండలి సభ్యునిగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సహా మరో 8 మంది సోమవారం ప్రమాణం చేశారు.
* గ్వాలియర్‌లోని ఓ మూడంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి ఏడుగురు వ్యక్తులు మరణించారు. పలువురు గాయపడ్డారు.