ప్రపంచం మొత్తం కంటికి కనపడని కరోనా వైరస్‌తో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం కశ్మీర్‌పై మాట్లాడుతోంది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది PoKపై స్పందిస్తూ.. కశ్మీర్‌పై, భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో టీమ్ఇండియా క్రికెటర్లు స్పందించారు. ఓపెనర్ శిఖర్‌ధావన్ అఫ్రిదీ వ్యాఖ్యలకు దీటైన జవాబిచ్చాడు. ‘కరోనా మహమ్మారితో ప్రపంచం పోరాడుతుంటే మీరు మాత్రం కశ్మీర్‌పైనే పడి ఏడుస్తున్నారు. కశ్మీర్ మాది. మాతోనే ఉంటుంది, ఎప్పటికీ మాదే. కావాలంటే 22 కోట్ల మందిని తీసుకురా. మాలో ఒక్కరు.. లక్షల మందితో సమానం’ అని తనదైన శైలిలో ధావన్ ట్వీట్ చేశాడు.
అఫ్రిది…22కోట్ల మందిని తీసుకువచ్చినా….!
Related tags :