Agriculture

52లక్షల టన్నులు సేకరించిన తెలంగాణా రైతుబంధు సమితి

Telangana Ryhu Bandhu Samithi Shatters New Records

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 7,581 కేంద్రాల్లో 52,88, 683 టన్నుల వ్యవసాయ దిగుబడులను సేకరించినట్లు రాష్ట్ర రైతుబంధుసమితి కంట్రోల్‌రూం వెల్లడించింది. 6,359 కేంద్రాల్లో 46,53,467 టన్నుల ధాన్యం, 1,097 కేంద్రాల్లో 5,46,766 టన్నుల మక్కజొన్న, 88కేంద్రాల్లో 79,912 టన్నుల శనగలు, 14 కేంద్రాల్లో 6,193 టన్నుల పొద్దుతిరుగుడు, 23 కేంద్రాల్లో 2,345 టన్నుల జొన్నల కొనుగోళ్లు జరిగాయి. ఆదివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,07,156 టన్నుల వ్యవసాయోత్పత్తులు సేకరించినట్లు కంట్రోల్‌రూం తెలిపింది. వాటిలో ధాన్యం 92,231 టన్నులు, మక్కజొన్న 14,447టన్నులు, శనగలు 26టన్నులు, జొన్నలు 452టన్నులు ఉన్నాయని కంట్రోల్‌ రూం వెల్లడించింది