బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఓ ఆస్పత్రిని సందర్శించేందుకు వెళ్లిన ఆ దేశ ప్రధాని సోఫీ విల్మాస్‌కు ఊహించని షాక్ తగిలింది.
కరోనా వైరస్‌పై ప్రభుత్వ వైఖరికి అక్కడి వైద్యులు, నర్సులు వినూత్నంగా నిరసన తెలిపారు.
ఆస్పత్రి వద్దకు చేరుకోగానే ఆమెకు తమ వీపులు చూపిస్తూ నిలబడ్డారు.
కొవిడ్-19 నేపథ్యంలో అర్హత లేని వారికి కూడా నర్సింగ్ బాధ్యతలకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో పాటు బడ్జెట్‌లో కోతలు, జీతాల తగ్గింపుపైనా వైద్యులు తీవ్ర అసహనంతో ఉన్నట్టు స్థానిక మీడియా చెబుతోంది.