కేరళలోని వయనాడ్‌లో పండించిన ఓ పనస పండు గిన్నిస్ రికార్డును కైవసం చేసుకుంది. ఏకంగా 52 కిలోలపైగా బరువుతో కాసిన పనస 117 సెంటీమీటర్ల పొడవు, 77 సెంటీ మీటర్ల చుట్టుకొలతతో ఉంది. ఈ పనసను చూసిన గ్రామపంచాయతీ అధికారులు గిన్నిస్ బుక్ అధికారులకు సమాచారం అందించారు. ఇందుకు కావాల్సిన పత్రాలను స్థానిక వ్యవసాయ అధికారి గిన్నిస్ సంస్థకు పంపించారు. ఇప్పటి వరకు పుణెలో పండిన 42.7 కిలోల బరువు, 57 సెంటీమీటర్ల పొడవు గల పనస పండే ప్రపంచ రికార్డుగా ఉంది. ఇప్పడు ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు కేరళలో పండిన రెండు పనస పండ్లు సిద్ధంగా ఉన్నాయి.
కేరళ పనస సరికొత్త గిన్నీస్ రికార్డు
Related tags :