Business

మీ విద్యుత్ బిల్లు ఇలా ఆదా చేసుకోండి

Save Your Electricity Bill With These AC Temp Control Tips

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియెన్సీ (BEE) ఏసీ తయారీదారులను తమ పరికరాల డిఫాల్ట్‌ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద ఉంచాలని ఆదేశించింది. ఉష్ణోగ్రతను పెంచే ప్రతీ డిగ్రీకి ఆరు శాతం విద్యుత్‌ ఆదా అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏసీని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచుకుంటే, దాని కంప్రెషర్‌లు ఎక్కువసేపు పనిచేస్తాయి. విద్యుత్‌ బిల్లును పెంచేస్తాయి.రోజువారి ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి. కాబట్టి బయటి ఉష్ణోగ్రతల కంటే ఏసీ ఉష్ణోగ్రత 10 డిగ్రీలు తక్కువ ఉండేలా చూసుకోవాలి. చాలామంది నిత్యం 18 పాయింట్లు ఉంచుతారు. అది సరైనపని కాదు.ఏసీ ఉన్న గదిలో కిటికీలూ తలుపులు మూసే ఉంచాలి. అంతేకాదు.. సూర్యరశ్మి లోపల పడకుండా కర్టెన్లు వేసుకోవాలి. ఏసీ ఉన్న గదిలో మరే ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఆన్‌లో ఉండకూడదు.