స్వీట్లు బాగా తింటున్నారా? ఉప్పు ఎక్కువ వాడుతున్నారా? అయితే మీరు సరిగ్గా నిద్రపోవడం లేదన్నమాట. నిజం… ఎక్కువ గంటలు నిద్రపోతే స్వీట్లు తినడం బాగా తగ్గుతుందిట. అధికంగా ఉప్పు వాడడం కూడా పోతుందిట. ఇది శుభవార్త. ఎందుకంటే రోజుకు కనీసం ఏడు గంటలు నిద్రపోకపోతే గుండె, జీవక్రియ సంబంధమైన జబ్బులు చుట్టుముడతాయి. వీటిని అధిగమించడానికి మంచి నిద్రే సిసలైన మందంటున్నారు నిపుణులు. ఇటీవల చేసిన ఒక పరిశోధనలో ఈ విషయమే వెల్లడైంది. బాగా నిద్రపోవడం వల్ల స్వీట్ల మీద కోరిక తగ్గుతుందిట. అలాగే ఉప్పు వాడకం కూడా ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందిట. ఈ స్టడీని దక్షిణాఫ్రికా కేప్‌టౌన్‌కి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ రాబ్ హెస్ట్ సారథ్యంలోని వైద్య బృందం నిర్వహించింది. నిద్రలేమి వల్ల కార్డియో మెటాబాలిక్ జబ్బులు వస్తాయి. అధ్యయనంలో భాగంగా 138 మందిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. వీరిలో కొందరు ఆరోగ్యంగా ఉంటే, మరికొందరు నిద్రలేమి, ఊబకాయం, హైపర్‌టెన్సివ్ షార్ట్‌స్లీపింగ్‌తో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది.
నిద్ర ఎక్కువైతే స్వీట్లు తగ్గుతాయి
Related tags :