పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యవరాలు. అయితే వీటిని తినే పద్ధతినిబట్టే పోషకాలు లభిస్తాయి. అందుకే వేటిని ఎలా తినాలో తెలుసుకోవాలి మరి…
**కోడిగుడ్లు
ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి.
*ఎలా తినాలి?
బాగా ఉడకబెట్టి, మెత్తగా చేసి, అందులో కొద్దిగా ఉప్పు చల్లి, ఆలివ్ నూనెతో కలిపి తింటే మంచిది.
** ఉసిరికాయలు
చెడుకొవ్వును, రక్తంలోని చక్కెరను, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. సి-విటమిన్ పుష్కలం.
*ఎలా తినాలి?
రోజూ ఒక టేబుల్‌స్పూన్ ఉసిరి రసాన్ని తేనెతో కలిపి సలాడ్ చేసుకుని తినవచ్చు.
** చిక్కుళ్లు
ఊబకాయం, గుండెజబ్బు, క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తాయి.
*ఎలా తినాలి?
ఉడకబెట్టిన బీన్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవచ్చు. సూప్‌లు, సలాడ్‌లలో కలిపి కూడా తినవచ్చు.
**బీట్‌రూట్
ఫోలేట్, మాంగనీస్, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి. శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
*ఎలా తినాలి?
పచ్చి బీట్‌రూట్ తురుమును సలాడ్‌లలో కలిపి, లేదా కొత్తిమీరతో తినవచ్చు.
**పెరుగు
జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రొటీన్లు, క్యాల్షియం చాలా ఎక్కువ.
*ఎలా తినాలి?
అన్నంలోనే కాకుండా పండ్లముక్కలు వేసుకుని కూడా తినవచ్చు. కొత్తిమీర చల్లుకుని తిన్నా బావుంటుంది.
** వెల్లుల్లి
క్రమం తప్పకుండా తీసుకుంటే చెడుకొవ్వును, అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు.
*ఎలా తినాలి?
వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి సలాడ్‌లలోను, సూప్‌లలోను, సాస్‌లోను కలుపుకోవచ్చు.