బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా అంపన్
ఒడిశాలోని పూరీ, ఖుర్దా, జగత్‌సింగ్‌పూర్‌లో భారీ వర్షాలు.
బాలాసోర్ జిల్లా, కటక్, కేంద్రపారా, జాజ్‌పూర్, గంజాం, భద్రక్‌లో ఈదురుగాలులతో భారీ వర్షాలు.
ఒడిశా పారాదీప్‌కు తూర్పు ఆగ్నేయంగా 120కి.మీ. దూరంలో కేంద్రీకృతం
బంగాల్‌లోని డిగాకు దక్షిణ ఆగ్నేయంగా 105 కి.మీ. దూరంలో కేంద్రీకృతం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో ఈదురుగాలులు
తీరం దాటాక గంటకు 110-120 కి.మీ. వేగంతో ఈదురుగాలులు
బంగ్లాదేశ్ వైపు వెళ్లాక తీవ్ర వాయుగుండంగా మారనున్న అంపన్. ఆ తర్వాత బలహీనపడుతుందని అంచనా.
తీరాన్ని తాకిన అంపన్ అతి తీవ్ర తుపాను
భీకరగాలులతో బంగాల్ తీరాన్ని తాకిన అంపన్ అతి తీవ్ర తుపాను.
పూర్తిగా తీరం దాటేందుకు నాలుగు గంటలు పడుతుందని స్పష్టం చేసిన వాతావరణ శాఖ.
బంగాల్-బంగ్లాదేశ్ మధ్య సుందర్బన్ వద్ద తీరం దాటుతుందని అంచనా.
ఇప్పటికే అల్లకల్లోలంగా మారిన ఒడిశా, బంగాల్ తీర ప్రాంతాలు.
ఆయా ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అంఫాన్ తుఫాన్ తీరంవైపు పరుగులు పెడుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా, తర్వాత తుఫాన్‌గా, ఆ తర్వాత మహాతుఫాన్‌గా మారి ఉత్తర దిశగా వేగంగా కదులుతున్నది.
అంఫాన్‌గా పేరు ఖరారైన ఈ తుఫాన్ బుధవారం ఒడిశా, పశ్చిబెంగాల్ మధ్యలో తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెనుతుఫాన్ పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా-బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో బలమైన ఈదురు గాలులులతో పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ తీరంపై అంఫాన్ ప్రభావం బలంగా కనిపిస్తున్నది.