* విజయనగరం జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డిప్యూటీ కమిషనర్ వై.బి భాస్కరరావు, అసిస్టెంట్ కమిషనర్ ఎస్.వి.ఎన్ బాబ్జిరావు ఆదేశాల మేరకు అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ బి. శ్రీనాథుడు ఆధ్వర్యంలో పార్వతీపురం డివిజన్ పరిధిలో గల పార్వతిపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో 43 కెన్ లోగల నాటుసారాను పట్టుకున్నారు. ఒడిశా నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న నాటుసారా. కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద పట్టుకున్నరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పార్వతీపురం ఏ.ఈ.ఎస్ బి శ్రీనాధుడు మాట్లాడుతూ 980 లీటర్ల నాటుసారా, ఒక బైక్, ఒక బొలెరో వాహనం,2 సెల్ ఫోన్ సీజ్ చేసారు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నరు ఈ దాడులలో పార్వతిపురం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సి ఐ అబ్దుల్ కలిమ్ మరియు ఎస్ఐ నాగేశ్వరావు వారి సిబ్బంది పాల్గొన్నారు
* నగరంలో ఏదో కుప్పకూలిన శబ్దం వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భారీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో, దానికి కారణమేమిటో తెలియలేదు. బుధవారం మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో బెంగళూరులో భారీ శబ్దం వినిపించిందని స్థానికులు చెప్పారు.
* పోలీసు శాఖ చరిత్రలో ఎన్నడూ చోటుచేసుకోని ఓ సంఘటన మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్‌లో చోటుచేసుకుంది. ఒకే ఒక్క డీసీపీపై 500 మంది కానిస్టేబుళ్లు దాడి చేసి సంచలనం సృష్టించారు. తాము ఉంటున్న బ్యారెక్‌లోనే ఉంటున్న మరో ఎస్సైకి కోవిడ్ పాజిటివ్ అని తేలిందని, అయినా శానిటైజేషన్ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ వారందరూ మూకుమ్మడిగా డీసీపీ ఎన్.ఎస్ పాల్‌పై మంగళవారం అర్ధరాత్రి దాడికి దిగారు.
* ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఇటావా నగరం ఫ్రెండ్స్ కాలనీ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి.
* కంబ దురు మండలం ఎగువపల్లి గ్రామంలో కుటుంబ సమస్యల తో మనోహర్(30)అను యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య.
* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం క్వారీ సెంటర్ వద్ద రౌడీ షీటర్ హత్య….హత్యకు గురైన వ్యక్తి సారంగధర మెట్ట తుమ్మలావ కు చెందిన అద్దేపల్లి సతీష్ గా గుర్తింపు.
* గుంటూరు జిల్లా మాచర్ల జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో మెరుపు దాడి. 7 వేల లీటర్ల నాటుసారా ఊట ధ్వంసం.