Fashion

నల్లపూసల ప్రియులకు శుభవార్త

Telugu Fashion News - Matching Black Bead Necklace Fashion

ఫ్యాషన్‌ను ఫాలో అయ్యే వాళ్లందరికీ మ్యాచింగ్‌ వేసుకోవడమంటే ఎంత పిచ్చో చెప్పనక్కర్లేదు. అయితే నల్లపూసల విషయంలో మాత్రం అది ఇప్పటి దాకా సాధ్యపడలేదు. దుద్దులూ, గాజులూ, ఉంగరాలూ ఇలా అన్నీ మార్చేసుకున్నా, వేసుకున్న డ్రెస్సుకు తగ్గట్టు నల్లపూసలు మార్చుకోవడమంటే కష్టమే. కానీ ఇప్పుడు నల్లపూసల్ని కూడా మన మ్యాచింగ్‌ ఫ్యాషన్‌లో భాగం చేసుకోవచ్చు. ఎలా అôటారా… ఇదిగో, ఈ ఇంటర్‌ ఛేంజబుల్‌ లాకెట్ల సాయంతో. ఈ రకం నల్లపూసల గొలుసులతో పాటు రంగురంగుల పూసలూ రాళ్లూ కలిగిన లాకెట్లూ, వాటికి తగ్గ జుంకాలూ వస్తాయి. మనం ఏ రంగు చీర లేదా డ్రెస్సు వేసుకున్నామో ఆ రంగులో ఉండే లాకెట్‌ను తీసుకుని, ఆ గొలుసుకు ఉండే కొక్కెం సాయంతో మార్చుకోవచ్చు. ఎంచక్కా నల్ల పూసల గొలుసునూ మ్యాచింగ్‌ మ్యాచింగ్‌లా పెట్టుకోవచ్చు.
Telugu Fashion News - Matching Black Bead Necklace Fashion
నల్లపూసల ప్రియులకు శుభవార్త