మాధురీ దీక్షిత్‌లోని నటికి, డ్యాన్సర్‌కి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు మాధురి. గాయనిగా తన ప్రతిభను చూపించబోతున్నారు. ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడారు మాధురి. ఈ పాటను శనివారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఇన్నేళ్లుగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నా నుంచి ఓ చిన్న బహుమానం ఇది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఓ చిన్న ఆశలాగా, పాజిటివ్ ఎనర్జీలాగా ఈ పాట ఉంటుంది. మనందరం ఈ కష్టాన్ని (కరోనా) కలసి దాటేద్దాం’’ అని ట్వీట్ చేశారు మాధురీ దీక్షిత్.
మాధురీ పాటలు
Related tags :