DailyDose

సీఐడీ విచారణకు హాజరయిన రంగనాయకమ్మ-తాజావార్తలు

Ranganayakamma Attends CID Interrogation

* టీటీడీలో తొలి మహిళా అధికారిగా ఎస్.భార్గవి…తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి మహిళా అధికారిగా ఐఏఎస్ అధికారిణి ఎస్. భార్గవి నియమితులయ్యారు. టీటీడీ జేఈవోగా (వైద్యం, విద్య) ఆమె బాధ్యతలను స్వీకరించారు.1976 జూన్ 3న జన్మించిన ఎస్. భార్గవి బీఎస్సీ హోమ్ సైన్స్ చదివారు. 2015లో ఐఏఎస్‌కు సెలక్ట్ అయ్యారు.ఆమె నియామకానికి సంబంధించి మే 15న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు ఆమె బాధ్యతలను స్వీకరించారు.కొన్ని రోజులుగా ఆమె పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారు.టీటీడీలో హెల్త్, ఎడ్యుకేషన్ విభాగాలను చూడడానికి ఓ మహిళా అధికారిని నియమించడం ఇదే తొలిసారి.

* ఇంగ్లిష్ మీడియం అమలుపై ఏపీ సర్కార్ తాజా నిర్ణయంఇంగ్లిష్ మీడియం అమలుపై తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వంఇంగ్లిష్ మీడియా అమలుపై సర్వే చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వంప్రముఖ సంస్థతో ధర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయంవిద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలు, ఇతర కార్యక్రమాలపై షార్ట్ ఫిల్మ్‌లు నిర్మించేందుకు ఆంగ్ల చానెల్‌కి ప్రభుత్వం అనుమతిసమగ్ర శిక్షణా అభియాన్ కింద షార్ట్ ఫిల్మ్‌లతో పాటు సర్వే చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం

* విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నా అభియోగాలతో కేసు ఎదుర్కొంటున్న రంగనాయకమ్మ గురువారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెను అధికారులు విచారిస్తున్నారు

* ఈరోజు అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన చేపట్టారు. చంద్రబాబు ఆదేశాల మేరకు పెరిగిన ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపట్టారు.

* సీఎం జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. కరోనా కేసులకు సంబంధించి కంట్రోల్ రూమ్ నుంచి సరైన సమాచారం రావట్లేదని అన్నారు. హెల్త్ బులెటిన్‌లో జిల్లాల వారీ సమాచారం అందించట్లేదని ప్రస్తావించారు.

* తాడిపత్రి వైసీపీ దాడులు ఎక్కువ అయ్యాయి- కిందిస్థాయి పోలీస్ సిబ్బంది పనితీరు బాగాలేదు-మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.

* హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎస్‌హెచ్‌యూను ఇవాళ తెరిచేందుకు సన్నాహాలు చేశారు. ఒక్కసారిగా తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.