DailyDose

TCS CEO జీతం తెగ్గోశారు-వాణిజ్యం

TCS CEO Salary Reduced By 16 Percent

* కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.. అలాగే బస్టాండుల్లో కరెంట్ బుకింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏపీలో బస్సులు రోడ్డెక్కాయి.. దాదాపు రెండు నెలల తర్వాత సర్వీసులు ప్రారంభమయ్యాయి.

* లాక్​డౌన్​ నాలుగో విడత సడలింపుల తర్వాత రైళ్ల పునరుద్ధరణకు సిద్ధమవుతోంది రైల్వే బోర్డు. ఈ మేరకు జులై 1 నుంచి నడిచే పాసింజర్​ రైళ్ల జాబితాను విడుదల చేసింది.

* హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎస్‌హెచ్‌యూను ఇవాళ తెరిచేందుకు సన్నాహాలు చేశారు. ఒక్కసారిగా తెల్లని పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

* దేశీయంగా విమానాలు నడిపే విమానయాన సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చింది. రాబోయే మూడు నెలల వరకు పౌర విమానయాన శాఖ నిర్దేశించిన టికెట్‌ ధరలనే అనుసరించాలని పౌర విమాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ ఆదేశించారు. ఈ నెల 25 నుంచి దేశీయ పౌర విమాన సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. వరుసగా మూడోరోజూ లాభాలను ఆర్జించాయి. అయితే, చివర్లో లాభాల స్వీకరణకు మదుపర్లు మొగ్గు చూపడంతో సూచీలు స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్‌ 114.29 పాయింట్లు లాభపడి 30,932.90 వద్ద ముగిసింది. నిఫ్టీ 39.700 పాయింట్లు లాభపడి 9,106.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 75.60గా ఉంది.

* టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ముఖ్య నిర్వహణాధికారి (సీఈఓ), మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథన్‌ వేతన ప్యాకేజీ గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో 16 శాతం తగ్గింది. 2018-19లో మొత్తం రూ.16.02 కోట్ల పారితోషికం అందుకోగా.. 2019-20లో అది రూ.13.3 కోట్లకు తగ్గినట్లు వార్షిక నివేదికలో సంస్థ వెల్లడించింది. టీసీఎస్‌ వార్షిక నివేదిక ప్రకారం.. 2019-20లో గోపీనాథన్‌ వేతనంగా రూ.1.35 కోట్లు, ప్రోత్సాహాకాలుగా రూ.1.29 కోట్లు, కమీషన్‌ కింద రూ.10 కోట్లు, అలవెన్సులుగా రూ.72.82 లక్షలు చొప్పున అందుకున్నారు. 2018-19లో ఇవి వరుసగా రూ.1.15 కోట్లు, రూ.1.26 కోట్లు, రూ.13 కోట్లు, రూ.60.36 లక్షలుగా ఉన్నాయి. టీసీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) గణపతి సుబ్రమణియన్‌ వేతన ప్యాకేజీ కూడా రూ.11.61 కోట్ల నుంచి 12.9 శాతం తగ్గి రూ.10.11 కోట్లకు పరిమితమైంది. ఇక టీసీఎస్‌ ముఖ్య ఆర్థిక అధికారి రామకృష్ణన్‌ రూ.3.98 కోట్ల ప్యాకేజీ పొందారు. గత ఆర్థిక సంవత్సరం చివర్లో కరోనా వైరస్‌ వల్ల తలెత్తిన పరిస్థితులతో వేతనాలు తగ్గాయని కంపెనీ పేర్కొంది.