DailyDose

తెలంగాణా రాష్ట్రంలో కరోనాతో తొలి పోలీసు మరణం-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - Police Constable Dies In TG Police Due To Corona

* ఏపీ రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2452 పాజిటివ్ కేసులు1680 మంది డిశ్చార్జ్54 మంది మరణించారు.ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 718.రాష్ట్రంలో గత 24 గంటల్లో (9ఆం-9ఆం)*8,092 సాంపిల్స్ పరీక్షి45 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్ధారణ41 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్కోవిడ్ వల్ల నెల్లూరు లో ఒక్కరి మరణం

* గుంటూరు పట్టణం రెడ్ జోన్ లోనే ఉన్నది. గుంటూరు బస్టాండ్ నుండి బయట ప్రదేశాలకు బస్సులు తిరగవు, ఇతర ప్రదేశాల నుండి గుంటూరుకు బస్సులు రావు. గుంటూరులో ఉదయం 6 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు నిత్యావసర సరకులకు బయటకు రావచ్చు. కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు బయటకు రావటానికి వీలు లేదు.. గుంటూరు జిల్లా కలెక్టర్

* తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14 వేలకు చేరువలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు 776 కేసులు నమోదయ్యాయి. ఒక్క చెన్నైలోనే 567 కేసులు గుర్తించారు. వీటితో రాష్ట్రంలో కేసుల సంఖ్య 13,967కు పెరిగింది. కరోనాతో గత 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 94కి పెరిగింది. ఈ రోజు డిశ్చార్జి అయిన 400 మందితో కలిపి మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,282.

* సాధారణ వ్యాధులతో పోలిస్తే కరోనా భిన్నమైనదని.. ఇలాంటి వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తే పేదలు ఇబ్బందిపడే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రాంగణంలో గ్రేస్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ కొవిడ్‌ ఐసీయూని మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఈటల ప్రారంభించారు. ఈ మొబైల్‌ కొవిడ్‌ ఐసీయూ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది.

* ఉత్తర్‌ ప్రదేశ్‌లో గత 24 గంటల్లో 360 కొవిడ్‌ పాజటివ్‌ కేసులు గుర్తించారు. వీటితో కలిపి యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,130కి చేరింది. ఇప్పటివరకు 127 మంది చనిపోగా, 3,099 మంది డిశ్చార్జి అయ్యారు. కేరళలో ఈ రోజు సాయంత్రం ఐదు వరకు 24 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 177 యాక్టివ్‌ కేసులు ఉండగా, 510 మంది నయమై డిశ్చార్జి అయ్యారు. ఇక చండీగఢ్‌లో కరోనా కేసుల సంఖ్య 216కి పెరిగింది. వీటిలో 48 మాత్రమే యాక్టివ్‌ కేసులు కాగా, ముగ్గురు చనిపోయారు.

* దిల్లీలో గత 24 గంటల్లో 571 కొత్త కరోనా కేసులను గుర్తించారు. ఇదే సమయంలో 375 మందిని డిశ్చార్జి చేశారు. దిల్లీలో ఇప్పటివరకు నమోదైన వివరాలు చూస్తే.. 11,659 పాజిటివ్‌ కేసులుండగా, అందులో 5,567 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనాతో 194 మంది మృతి చెందారు.

* తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న దయాకర్‌ రెడ్డి అనే కానిస్టేబుల్‌ కరోనాతో పోరాడుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. లాక్‌డౌన్‌ విధుల్లో భాగంగా పాతబస్తీలోని ఓ చెక్‌పోస్ట్‌ వద్ద ఆయన విధులు నిర్వర్తించారు.