వందే భారత్ మిషన్ కువైట్ నుండి 21న రాత్రి 1.50 గంటలకు (22న ఉదయం 1.50) రేణిగుంట చేరుకున్న ఎయిర్ ఇండియా ఎయిర్ బస్సు విమానం.
కువైట్ నుండి 150 మంది ప్రావాసాంధ్రులు రాక , ఒకరు హైదరాబాద్ లో దిగగా 149 మందితో తిరుపతి విమానాశ్రయానికి రాక .
ఏర్పాట్లు పర్యవేక్షణ చేసిన జెసి ( అభివృద్ధి)వీరబ్రహ్మం, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి జెసి (అభివృద్ధి )
వందే భారత్ మిషన్ లో భాగంగా కోవిడ్ 19 ఇబ్బందులుతో మొదటి సారి రేణిగుంట విమానాశ్రయానికి శుక్రవారం ఉదయం 1.50 గంటలకు కువైట్ నుండి ప్రవాసాంధ్రులు చేరుకోవడంతో స్వాగతం పలికిన జిల్లా జెసి (అభివృద్ధి ) వీరబ్రహ్మం , తిరుపతి ఆర్డిఓ కనక నరసారెడ్డి, జిల్లా యంత్రాంగం.
ఎయిర్ బస్ సిటింగ్ 150. ఒకరు హైదరాబాద్ శంషాబాద్ లో దిగగా, 149 మంది రేణిగుంట
విమానాశ్రయం చేరుకున్న వీరు కోవిడ్ నిబంధనలు మేరకు భౌతిక దూరం పాటిస్తూ 20 మంది చొప్పున ఒక్కోసారి రాగా సానిటాయిజర్ తో చేతులు శుభ్రపరుచుకోవడం, అనంతరం మాస్కులు అందించిన విమానాశ్రయ అధికారులు.
వచ్చిన వారు తమ సెల్ఫ్ డిక్లరేషన్ పారాలు పూర్తిచేసి అధికారులకు అందించిన ప్రవాసులు.
ఇమిగ్రేషన్ ప్రక్రియ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో పూర్తి అయిందని తెలిపిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్.
కువైట్ నుండి వచ్చిన ప్రవాసులకు విమానాశ్రయంలో ఫీవర్ సర్వే నమోదు చేసిన రేణిగుంట పి.హెచ్.సి.డా.మధు సూదన్ రావు, సిహెచ్ ఓ డా. కృపా వరమ్మ , వైద్య అధికారులు, ఎ. ఎన్. ఎం. లు సిబ్బంది.
మొబైల్ సిమ్, ఆరోగ్యసేతు యాప్ డౌన్ లోడ్ వంటివి ప్రవాసాంధ్రులకు అందించడంలో సహాయకులుగా రేణిగుంట సచివాలయ, వాలింటర్లు.
ఎయిర్ పోర్ట్ అథారిటీ డిస్ ఇన్ఫెక్షన్ చేసిన లగేజీని ప్రవాసులకు అందించారు.
జిల్లా కు చెందిన 7 గురుతో పాటు చెన్నై ఒకరు, అనంతపురం ఇద్దరు, కర్నూలు ఒకరిని తిరుపతి లొనే క్వారేంటైన్ సదుపాయం కల్పించి టూరిజం అధికారులు.
స్వంత జిల్లాలకు తరలించడానికి ఆర్.టి.సి. అధికారులు విమానాశ్రయం నుండి కడప, వైజాగ్ మార్గాల్లో ఆర్టీసీ బస్సులు ఏర్పాటు.
కడపజిల్లాకు 4 బస్సులు.(116 మంది)
వైజాగ్ రూట్ వెళ్లే బస్సులో తూ. గోదావరి 6, కృష్ణ 1, నెల్లూరు 6, వైజాగ్ 4, ప.గోదావరి 5 మంది మొత్తం 22 మందితో బయలుదేరిన ఆర్టీసీ బస్సు.
ప్రతి బస్సులలో పోలీసు ఎస్కార్ట్ తో భద్రత ప్రయాణం ఏర్పాటు.
14 రోజుల క్యారేంటైన్ లో గడపనున్న ప్రవాసులు. క్వారేంటైన్ చేరుకున్న వీరికి స్వాబ్ పరీక్షలు నిర్వహణ చేయనున్న వైద్య అధికారులు.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ ప్రవాసులకు పలు సూచనలు అందించి, వారి అనుమానాలు నివృత్తి చేసారు.
ప్రవాసులకు వాటర్ బాటిల్స్, టీ, కాఫీ, స్నాక్స్ , ఫ్రూట్స్ వంటివి అందించిన జిల్లా యంత్రాంగం.
వీరికి ఎయిర్ పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర్ రెడ్డి, ఇండియన్ ఎయిర్ లైన్స్ టర్మీనల్ మేనేజర్ బాబీ, సి ఐ ఎస్ ఎఫ్ డిప్యూటి కమాండెంట్ శుక్లా, రేణిగుంట తహసీల్దార్ విజయసింహా రెడ్డి, డిటి శివ ప్రసాద్, డిఎస్పీ లు చంద్రశేఖర్, మల్లికార్జున, టూరిజం అధికారులు చంద్రమౌళి రెడ్డి, సురేష్ రెడ్డి, చంద్రశేఖర్ విమానాశ్రయంలో విధులు నిర్వహించి ప్రవాసులకు సహాయ సహకారాలు అందించిన వారిలో ఉన్నారు.