వరంగల్ శివారులో తొమ్మిది మృతదేహాలు బయటపడటం తీవ్రకలకలం రేపింది. నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు తొమ్మిది మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో ఐదు మృతదేహాలు గుర్తించారు. ఎలాంటి గాయాలు లేకుండా తొమ్మిది మృతదేహాలు బావిలో ఉండటంతో హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు ఎండీ మక్సూద్(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), బుస్ర కుమారుడు(3)గా గుర్తించారు. ఇవాళ లభ్యమైన ఐదు మృతదేహాలు షాబాద్(22), సోహైల్(20), బిహార్‌కు చెందిన కార్మికులు శ్యామ్(22), శ్రీరామ్(20), వరంగల్ వాసి షకీల్ గా గుర్తించారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని వరంగల్ సీపీ రవీందర్, మేయర్ జి.ప్రకాశరావు పరిశీలించారు.
వరంగల్ బావిలో శవాల కుప్పలు
Related tags :