తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసభవనమైన పోయెస్ గార్డెన్ ను ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునే ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. జయలలిత మరణానంతరం చట్టపరమైన వారసుల పరిష్కారం జరగనందున ప్రభుత్వం తాత్కాలికంగా పోయెస్ గార్డెన్ భవనాన్ని స్వాధీనం చేసుకుందని తమిళనాడు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. తమిళనాడు సర్కారు తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ సమ్మతి తెలిపారు. మాజీ ముఖ్యమంత్రికి చెందిన పోయెస్ గార్డెన్ నిర్వహణకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి, సమాచారశాఖ మంత్రి, సమాచార శాఖ కార్యదర్శి ధర్మకర్తలుగా ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ స్వాధీనానికి ఆర్డినెన్స్ జారీ
Related tags :