హిట్టు, ప్లాప్‌లతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో రాశీఖన్నా అవకాశాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్లలో తనూ ఒకరు. ఇటీవల వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తనకు మంచి విజయాన్ని ఇస్తుందని ఆ సినిమా కోసం ఎంత కష్టపడినా.. తనకి మాత్రం తను ఊహించిన విజయాన్ని ఆ చిత్రం ఇవ్వలేకపోయింది. అయినా అంతకు ముందు రాశీ ఖన్నా అకౌంట్‌లో ‘ప్రతిరోజూ పండగే’ వంటి మంచి హిట్ ఉండటంతో.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఎఫెక్ట్ తనపై పెద్దగా పడలేదు. అయితే ఈ భామ తన రీసెంట్ ఇంటర్య్వూలో తనపై అస్సలు గాసిప్స్ రావని చెప్పుకొచ్చింది. అందుకు కారణం ఏమిటో కూడా తెలిపింది.‘‘నేను కావాలనే ఈ మధ్యకాలంలో విభిన్న పాత్రలు చేస్తున్నాను. ప్రేక్షకులను నేను అన్ని రకాల పాత్రలలో నటించి మెప్పించాలనుకుంటున్నాను. అందుకే వైవిధ్యానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తున్నాను. ఇక నాపై గాసిప్స్ నడవకపోవడానికి కారణం.. నేను వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండటమే. నా లిమిట్స్ ఏమిటో నాకు తెలుసు. ఒకవేళ నాపై గాసిప్స్ వచ్చినా నేను అస్సలు వాటిని పట్టించుకోను. నా పనేదో నేను చూసుకుంటా. హంగులు, ఆర్భాటాలు నాకు నచ్చవు. సింపుల్‌గా ఉండాలనుకునే అమ్మాయిను నేను..’’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.
నా మీద పుకార్లు పుట్టవు
Related tags :