వేసవికాలం కాస్తనీరసంగా అనిపించగానే సగ్గుజావ తాగేస్తాం. నిస్సత్తువ నుంచి కోలుకునేలా చేయడంతో పాటూ దీంతో మరెన్నో ప్రయోజనాలున్నాయి..
* సగ్గుబియ్యంలో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. దాంతో అలసిన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. వ్యాయామం తర్వాత తినదగ్గ మంచి ఆహారం.
* దీనిలోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండె మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా సాయపడుతుంది.
* సగ్గుబియ్యంలోని క్యాల్షియం వల్ల ఎముక బలం పెరుగుతుంది.
* దీనిలోని ఆహారసంబంధిత పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మేలుచేస్తుంది.
సమ్మర్‌లో సగ్గుబియ్యం సేవించండి
Related tags :