కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన బ్యాడ్మింటన్.. హైదరాబాద్ ఓపెన్‌తో మళ్లీ ప్రారంభంకానుంది. ఆగస్టు 11 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో జరిగే టోర్నీతో ప్రపంచ బ్యాడ్మింటన్ క్యాలెండర్ మొదలవుతుంది. కరోనా కారణంగా దెబ్బతిన్న టోర్నీల క్యాలెండర్‌ను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) శుక్రవారం సవరించింది. కరోనా సమయంలో వాయిదా పడిన 8 టోర్నీలకు కొత్త తేదీల్ని ప్రకటించింది. నవంబరు 17 నుంచి 22 వరకు సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ జరుగుతుంది. ఒలింపిక్ క్వాలిఫయర్ ఈవెంట్ ఇండియా ఓపెన్ సూపర్ 500 టోర్నీ డిసెంబరు 8 నుంచి 13 వరకు దిల్లీలో నిర్వహిస్తారు. మార్చి 24 నుంచి 29 వరకు జరగాల్సిన ఈ టోర్నీ కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే హైదరాబాద్ ఓపెన్ నిర్వహణపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ‘ఈనాడు’తో తెలిపాడు. అయితే 5 నెలల వ్యవధిలో 22 టోర్నీలు నిర్వహించాలన్న బాయ్ నిర్ణయంపై క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆగష్టు నుండి బ్యాడ్మింటన్ సీజన్ ప్రారంభం
Related tags :