తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి అక్కడ ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి కోరారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి లేఖ కూడా రాశారు. మార్చి 20వ తేదీన హైదరాబాద్ వెళ్లిన చంద్రబాబు లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఏపీకి వెళ్లేందుకు అనుమతి కోరుతూ రెండు రాష్ట్రాల డీజీపీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి రాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి అనుమతి రాలేదు. హైదరాబాద్‌లో 25వ తేదీన ఉదయం 10:35 గంటలకు బయలుదేరి విశాఖ వెళ్లనున్నట్లు ఏపీ డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన బాధితులను పరామర్శించి అక్కడి నుంచి రోడ్డు మార్గాన అమరావతి వెళ్లనున్నట్లు చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
ఎల్జీ పాలీమర్స్ బాధితులను కలవనున్న బాబు
Related tags :