Health

భారతదేశవ్యాప్తంగా 28లక్షల మందికి మాత్రమే కరోనా పరీక్షలు

India Only Tested 28lakh People For COVID19 Out Of 1.2Billion

* కరోనా వైరస్​ సోకకుండా వైద్య సిబ్బంది ముందుజాగ్రత్తగా తీసుకుంటున్న హైడ్రాక్సీక్లోరోక్విన్​ (హెచ్​సీక్యూ) మాత్రలను కంటెయిన్​మెంట్​ జోన్లలో పనిచేసే పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి కూడా ఇవ్వాలని ఐసీఎంఆర్​ సిఫార్సు చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరికి ఈ మందు ఇవ్వొచ్చు, ఎవరికి ఇవ్వకూడదన్నది అందులో సవివరంగా పేర్కొంది.

* దేశంలో కరోనా మహమ్మారి కాలు మోపినప్పటి నుంచి ఇప్పటివరకు 28,34,798 మందికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ICMR) వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఉదయం ICMR ఒక బులెటిన్‌ విడుదల చేసింది.

* చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసులు 231 అని, ఇందులో ఇప్పటి వరకు 132 మంది కోవిడ్ -19 వైరస్ ను జయించి డిశ్చార్జ్ కావడమైనదని ఇందులో నేడు 11 మంది డిశ్చార్జ్ కావడం జరిగిందని, (ఒకరు కోవిడ్-19 బారిన పడి మరణించారు) ప్రస్తుతం యాక్టివ్ పాజిటివ్ కేసులు 98 అని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

* పీలేరుకు ఢిల్లీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ప్రాథమిక వైద్య పరీక్షలో కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. ఢిల్లీలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల వ్యక్తి ఈనెల17న ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ ప్రెస్ రైలులో ఆనంతపురంకు వచ్చాడని, అక్కడి నుంచి పోలీసుల సహకారంతో పలమనేరుకు చెందిన ఓ యువతితో కారులో కలసి ప్రయాణం చేసి పలమనేరుకు వచ్చాడు. అదే కారులో అతను పీలేరులోని తన అత్తింటికి చేరుకున్నాడు. పలమనేరు యువతికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో ఆ యువతి ఇచ్చిన వివరాలతో పాటు పీలేరుకు బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించిన వైద్యశాఖ అధికారులు 21 మందిని గుర్తించి వారికి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వాబ్ టెస్టులు నిర్వహించారు. వారిలో ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కూడా కరోన పాజిటివ్ ఉండడం, అతనికి వైద్య పరీక్షలో పాజిటివ్ ఉన్నట్లుగా వైద్యాధికారులు గుర్తించారు. దీంతో ఆ వ్యక్తితో పాటు అతని అత్తను కూడా క్వారెంటైన్ కు తరలించారు. షుకూర్ ప్యాలెస్ సమీపంలోని పరిసరాల్లో ప్రజలను వైద్యాధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. అలాగే ఆపరిసరాలను స్యానిటైజ్ చేయించేందుకు స్థానిక సిఐ సాదిక్ అలీ, ఎస్సై క్రిష్ణయ్య, పంచాయితీ కార్యదర్శి సత్యం రెడ్డి, శ్యానిటరీ ఇన్ స్పెక్టర్ రవికుమార్, తలుపుల ప్రాథమిక వైద్యాధికారి, సిబ్బంది సిద్ధమయ్యారు. ఈ ప్రాంతాన్ని
మదనపల్లి డిప్యూటీ డియంహెచ్ఒ డాక్టర్ లోకవర్ధన్ తదితర అధికారులు పర్యటించారు.