WorldWonders

నిప్పులే కుప్పగా….

Telangana shatters temperature records in summer 2020 with 47celsius

రాష్ట్రంలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. శనివారం ఈ ఎండాకాలంలోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో, పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. నిర్మల్‌ జిల్లాలో 46.3 డిగ్రీలు, మంచిర్యాలలో 45.9 డిగ్రీలతోపాటు పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. ఆదివారం కూడా రాష్ట్రంలోని 19 జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్ర హెచ్చరించింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌రూరల్‌, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీయొచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు హెచ్చరించారు. ఉపరితల ద్రోణి కారణంగా ఈ నెల 26న అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో 42.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.