కొత్తగూడెంలో నిత్యావసరాలు పంపిణీ చేసిన మందలపు ట్రస్టు
మందలపు ట్రస్ట్ మరియు తానా వారి సహకారంతో కొత్తగూడెంలో కొత్తగూడెం క్లబ్ మరియు 7 హిల్స్ నందు మునిసిపల్ పారిశుధ్య కార్మికులకు, వికలాంగులకు, కళాకారులకి మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) చేతుల మీదుగా నిత్యవసర సరుకులు మరియు బియ్యం పంపిణి చేశారు. తానా ఫౌండేషన్ కార్యదర్శి, మందలపు ట్రస్ట్ నిర్వాహకులు మందలపు రవి కొత్తగూడెం నియోజకవర్గం నందు 2000 కిట్లు పంపిణి చేసేందుకు సహాయం చేయడం హర్షణీయమని అన్నారు.