* గుంటూరు నగరంలోని కళ్యాణ్ నగర్, మారుతీ నగర్‌లోని సుమారు 500 పేద ముస్లిం కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్‌ను నాట్స్-మన్నవ మోహనకృష్ణ ట్రస్టులు తోఫాగా అందించాయి. ఈ పంపిణీ కార్యక్రమంలో మస్తాన్ వలి ,బాజీ,స్వరూప్, సాయినాధ్, అంబరీష్, చైతన్య, సీకే రావు, అఖిల్, అనంత్, చిన్న మీరవాలి, సయ్యద్ మాబు, మాలిక్ రఫీ ఫునిషా, తేజ తదితరులు పాల్గొన్నారు.
* సెయింట్ లూయిస్ లోని డౌన్ టౌన్ లో నాట్స్ 250 మందికి ఆహారాన్ని అందించింది. నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ నాయకులు సుధీర్ అట్లూరి, నాట్స్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రమేశ్ బెల్లం, నాట్స్ సెయింట్ లూయిస్ ఛాప్టర్ కో ఆర్డినేటర్ నాగ శ్రీనివాస్ శిష్ట్ల, వైఎస్ఆర్‌కే ప్రసాద్, సురేశ్ శ్రీ రామినేని, నరేశ్ చింతనిప్పు, శ్రీని తోటపల్లి, రమేష్ అత్వాల, అమేయ్ పేటే, రఘు పాతూరి తదితర నాట్స్ ప్రతినిధులు ఈ ఆహార పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
* కరోనా సమయంలో సామాజిక బాధ్యతపై నాట్స్ వెబినార్ నిర్వహించింది. సీబీఐ మాజీ డైరక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాట్స్ ఛైర్మన్ అప్పసాని శ్రీధర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అంతర్జాలంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరోనా విషయంలో ప్రస్తుతం అమెరికాతో పోల్చుకుంటే భారత్ ఎంతో సురక్షితంగా ఉందని ఆయన అన్నారు. భారత్ ముందుస్తుగా లాక్‌డౌన్ అమలు చేయడంతో పాటు.. భారతీయ జీవన విధానమే భారతీయులకు రక్షణకవచంలా మారిందని లక్ష్మీనారాయణ అన్నారు. కరోనా కమ్ముకుంటున్న ఈ వేళ ఇప్పుడు భారతీయ జీవన విధానం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని.. దీనిపై అమెరికాలో కూడా అక్కడ ఉంటున్న తెలుగువారు విస్తృతంగా ప్రచారం చేసి.. మన గొప్పతనాన్ని చాటాలన్నారు.