‘కంచె’ సినిమాతో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైశ్వాల్. ఆపై ‘ఓం నమో వెంకటేశాయ’, ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలతో అలరించారు. 2018 తర్వాత ఆమె కొత్త చిత్రానికి సంతకం చేయలేదు. కాగా ఆదివారం ఆమె ట్విటర్ వేదికగా ఫాలోవర్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ .. ‘మీరు వరుసగా చిత్రాల్లో ఎందుకు నటించడం లేదు?, ఎందుకు విరామం తీసుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నాం’ అని పేర్కొన్నారు. దీనికి ప్రగ్యా స్పందిస్తూ.. ‘ధన్యవాదాలు. సరైన స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నా’ అని సమాధానం ఇచ్చారు.
కథల కోసం ప్రగ్యా ఎదురుచూపులు
Related tags :