కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భౌతిక దూరం పాటించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కరోనా లాంటి వైరస్‌లు మనుషులు దగ్గరగా ఉన్న సమయంలో ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయని వైద్యులు చెప్తుంటారు. లాక్‌డౌన్ సమయంలో మనం నేర్చుకొన్న కొన్ని మంచి విషయాల్లో చేతులు, కాళ్ల పరిశుభ్రతతోపాటు భౌతిక దూరం పాటించడం. అయితే భౌతిక దూరం పాటించడం వల్ల కరోనా లాంటి వైరస్‌లను దూరంగా పెట్టుడు మాటేమోగానీ.. గుండె మాత్రం ఇక్కట్లలో పడిపోతుందంటున్నారు వైద్యనిపుణులు. సాంఘిక ఒంటరితనం కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు 40 శాతం ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. జర్మనీలోని ఎస్సెన్ యూనివర్సిటీ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకుడు ఢాక్టర్ జానైన్ గ్రోన్‌వోల్డ్ ఆధ్వర్యంలో పదమూడేండ్ల పాటు ఈ పరిశోధన కొనసాగింది. ఇందులో పాల్గొన్నవారికి హృదయ సంబంధ వ్యాధుల గురించి తెలియకుండా అధ్యయం చేపట్టారు. పరిశోధకులు సగలున 59.1 ఏండ్ల వయసుగల 4,316 మంది నుంచి డేటాను తీసుకొని పరిశీలించారు. వీరిలో నుంచి 339 మంది హార్ట్ అటాక్ వంటి కార్డియోవాస్క్యులార్ వ్యాధులు, 530 మంది మృత్యువాతకు గురయ్యారు. సామాజిక సంబంధాలు లేకపోవడం వల్ల హృదయ సంబంధ సంఘటనల యొక్క భవిష్యత్ ప్రమాదాన్ని 44 శాతం పెంచుతుందని, అన్ని కారణాలచే మరణించే ప్రమాదాన్ని 47 శాతం పెంచుతుందని, ఆర్థిక సహాయం లేకపోవడంతోపాటు హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాన్ని 30 శాతం పెంచుతుందని తేలింది. కొవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు మనం సామాజిక సంబంధానుల నివారించాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. మన జీవితంలో సామాజిక సంబంధాల ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని మనం గుర్తించాలి. మన సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడాన్ని మనం తరుచుగా విస్మరిస్తున్నప్పటికీ.. ఈ మహమ్మారి కారణంగా దాని ప్రాముఖ్యాన్ని గ్రహించే అవకాశం లభించింది. ఇది సానుకూల భావోద్వేగాలను మాత్రమే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా కొనసాగించడంలో మనకు ఎంతగానో సహాయపడుతుంది.
ఒంటరిదనంతో గుండెపోటు
Related tags :