* కేవీపల్లె మండలంలో తెల్లవారుజామున ఉద్రిక్తత నెలకొంది.నక్కలదిన్నె, వడ్డేపల్లిలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణ చెలరేగింది.కేవీపల్లె నూతనకాల్వ, నక్కలదిన్నె వడ్డేపల్లి గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయారు.నీటి సమస్యపై మహిళల మధ్య ప్రారంభమైన తగాదా కాస్త.. గ్రామాల మధ్య గొడవగా మారింది.రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ బైకుకు నిప్పటించారు.సమాచారం అందుకున్న మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి పరిశీలిస్తున్నారు.
* తూర్పు గోదావరి జిల్లా.. రాయవరం మండలం,చెల్లూరు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే రాయవరం మండలం చెల్లూరు గ్రామానికి చెందిన ఇమంది సుబ్బారావు (65) సం” సుబ్బారావు దేవాలయంలో వాచ్ మేన్ గా విధులు నిర్వహిస్తూ తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో వెనక నుండి వచ్చిన ఆపొ5 ట్X 5535 గల కోళ్ల సరఫరా వ్యాను ముందర భాగం నుండి ఢీ కొట్టడంతో సుబ్బారావు అక్కడికి అక్కడే మృతి చెందాడు.
* సారా బట్టీలపై ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో దాడులు. రామవరపుమోడీ అర్తమూరు మణిమేశ్వరం గ్రామాలలో ఏకకాలంలో సారా బట్టీలుపై దాడులు. దాడుల్లో 50 లీటర్ల కాపుసారా 40 కిలోల నల్లబెల్లంతో పాటు 3,000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 5 గురిపై కేసు నమోదు.
* సత్తెనపల్లి సబ్ డివిజన్ పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో పిడుగురాళ్ల సిఐ గారికి అందిన సమాచారం మేరకు గుత్తికొండ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద పేకాట స్థావరం పై దాడి నిర్వహించి అక్కడ జూదం ఆడుతున్న పదిహేను మంది వ్యక్తులను పట్టుకొని వారి వద్ద నుండి ₹1,57,550 సొమ్మును 17 మోటర్ సైకిల్ ను మరియు 13 సెల్ ఫోన్ లను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన పిడుగురాళ్ల పోలీసులు.
* కర్నూలు సిఐడి డిఎస్పీ మహబూబ్ బాషా సస్పెన్షన్ వేటు. ఎసిబి డిస్పీగా ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డిఎస్పీ మహబూబ్ బాషాపై సపెన్షన్ వేటు.
* కావలిలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. ఆర్టీసీ డిపో ఆవరణలో ఉరివేసుకుని ఆత్మహత్య. ముసునూరుకి చెందిన బోయిన మాలకొండయ్య (50)గా గుర్తింపు.
* పగో. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో రోడ్డుపై వేసిన చెత్త కుప్ప లకు నిప్పు పెట్టడంతో ఆ పొగకు రోడ్డు కనిపించక ప్లాస్టిక్ వ్యర్ధాలు కూడా తగల పడడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రయాణికులు