* కాకినాడ జేఎన్టీయూ క్వారంటైన్ సెంటర్ లో కరోనా అనుమానితుల ఆందోళన..క్వారంటైన్ సెంటర్ లో పాడైపోయిన ఆహారం ఇస్తున్నారని ఆరోపణ..క్వారంటైన్ సెంటర్ లో కనీస పారిశుద్ధ్య పనులు చేయడం లేదంటూ ఆందోళన..కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను తమను ఓకే క్వారంటైన్ లో ఉంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బాధితులు..సుమారు రెండు వందల మంది ని ఒకే క్వారంటైన్ లో పెట్టి కనీస మౌలిక వసతులు కల్పించలేదంటూ ఆగ్రహం.
* తెలంగాణలో ఈ రోజు 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,854కి పెరిగింది. ఈ రోజు 24 మంది డిశ్చార్జి కాగా, మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,092. ఈ రోజు మరణించిన నలుగురుతో కలిపి.. రాష్ట్రంలో మృతుల సంఖ్య 53కి పెరిగింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 709 మంది కరోనా చికిత్స పొందుతున్నారు.
* షాద్ నగర్ పట్టణంలో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ లావణ్య పట్టణంలోని అన్ని దుకాణ సముదాయాలను మూసి వేయాలని ఆదేశాలు జారీ చేశారు.
* ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షలు నిర్వహిస్తోన్న కొద్దీ కరోనా వైరస్ కేసులు భారీగా బయటపడుతున్నాయి. గత 24 గంటల్లో 11,357 శాంపిళ్లను పరీక్షించగా మరో 66 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 29 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 2,627 అని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 764 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 1,807 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 56కి చేరింది
* భారత్‌లో గత 24 గంటల్లో కొత్తగా, 6,767 కరోనా కేసులు నమోదు..కోవిడ్ పాజిటివ్ తో 147 మంది మృతి,దేశవ్యాప్తంగా 1,31,868 కి చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటి వరకు 3,867 మంది మృతి..కరోనా యాక్టివ్ కేసులు 73,560..ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో కోలుకున్న వారు 54,441