తను సినిమాల్లో నటించి సంపాదించిన డబ్బంతా చికిత్సకే సరిపోయిందని నటి ఈషా గుప్తా అన్నారు. 2012లో ‘జన్నత్ 2’ సినిమాతో కెరీర్ ఆరంభించిన ఈ భామ ఆపై పలు సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని కూడా పలకరించారు. రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన ‘వినయ విధేయ రామ’ (2019) సినిమాలో అతిథి పాత్ర పోషించారు. ‘ఏక్ బార్..’ సాంగ్‌లో చెర్రీతోపాటు హుషారుగా స్టెప్పులేశారు. గోల్డీ బెహల్ తెరకెక్కించిన డిజిటల్ సిరీస్ ‘Rejctx 2’లో పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా ఇటీవల కనిపించనున్నారు. అయితే దాదాపు ఐదేళ్ల క్రితం మోకాలికి గాయమైందని ఆమె తాజాగా అన్నారు. ‘కెరీర్ ఆరంభంలో ఎక్కువ సినిమాల్లోనే నటించా. 2014-2015లో తక్కువగా పనిచేశా. దానికి కారణం నా మోకాలికి తీవ్ర గాయం కావడమే. కానీ శస్త్రచికిత్స చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే.. సర్జరీ అంటే నాకు చాలా భయం. అందుకే ఎక్కువగా పనిచేయలేకపోయా. కాలు నొప్పి వల్ల డ్యాన్స్ చేయలేకపోయేదాన్ని. హీల్స్ ధరించలేకపోయేదాన్ని. అప్పుడు నా పరిస్థితి ఘోరంగా ఉండేది. కదలలేని పరిస్థితిలో ఉండటంతో బరువు పెరిగిపోయా. ఆ నొప్పి నుంచి కోలుకోవడానికి నాకు సంవత్సరం పట్టింది. కేవలం ఫిజియోథెరపీ ద్వారా గాయాన్ని నయం చేసుకున్నా. నేను ఆరంభంలో సినిమాల ద్వారా సంపాదించిన డబ్బంతా వైద్యుల ఫీజుకు ఖర్చుపెట్టాల్సి వచ్చింది’.
సంపాదన మొత్తం మోకాలు మింగింది
Related tags :