కరోనా సంక్షోభం తర్వాత చైనా కేంద్రంగా పనిచేస్తున్న అనేక కంపెనీలు తమ స్థావరాల్ని మార్చే యోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో వాటిని ఆకర్షించేందుకు భారత్‌లోని అనేక రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు అనేక రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. తాజాగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ సైతం ప్రోత్సహకాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం తరఫున కావాల్సిన అన్ని రకాల వసతుల్ని సమకూర్చుతామన్నారు. ఈ మేరకు అనేక దేశాల రాయబార కార్యాలయాల్ని సంప్రదిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జపాన్, కొరియా, తైవాన్ దౌత్య కార్యాలయాలకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. వారితో చర్చలు కూడా జరుపుతున్నట్లు వెల్లడించారు. కంపెనీ స్థాపనకు కావాల్సిన భూమి, మౌలికవసతులు సహా ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
అత్యద్భుత ప్రణాళికతో సిద్ధంగా ఉన్న పంజాబ్
Related tags :