Health

వూహాన్‌లో రెండో రౌండ్ కరోనా విజృంభణ

Second Round Of Coronavirus Sweeping Wuhan China

చైనాలో మళ్లీ కొవిడ్‌-19 పంజా విసురుతోంది. ఇప్పుడిప్పుడే కరోనా వైరస్‌ నుంచి బయటపడుతున్నామని భావిస్తున్న తరుణంలో కొత్త కేసుల నమోదు కలవరపెడుతున్నది. రెండు, మూడు రోజులుగా చైనాలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. కాగా, సోమవారం ఏకంగా 51 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 38 మంది వైరస్‌ పురుడు పోసుకున్న వుహాన్‌ వాసులే ఉండటం విశేషం. 10 కేసులు మంగోలియా అటానమస్‌ రీజియన్‌, ఒక కేసు సిచువాన్‌ రాష్ట్రంలో నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారికి మిగతా కేసులు రికార్డయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ అధికారులు తెలిపారు. ప్రపంచంలోనే కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా నిలిచిన వుహాన్‌లో గత 10 రోజులుగా 60 లక్షల మందికి పైగా కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వుహాన్‌లో మరో 326 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.