* నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దు జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. మద్యం సీసాలతో ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు.ఒకరు విజయవాడ జీఆర్పీలో డిప్యూటేషన్‌లో పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ శివరామకృష్ణగా గుర్తించారు.మరొకరు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గుంటి నాగేశ్వరరావు అని తెలిపారు.వీరి వద్ద దాదాపు 400 వందల క్వార్టర్ బాటిళ్లు, 20 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
* చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం బుక్కపట్నం ,కాలేపల్లి ప్రాంతాల్లో, సోమవారం ఉదయం నాటు సారా తయారు చేస్తున్న ప్రాంతాలపై ఎక్సైజ్ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
* కూన రవికుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.మాజీ ప్రభుత్వ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్‌కు రంగం సిద్ధం.పొందూరు తహసీల్దార్‌ను దుర్భాషలాడారంటూ రవికుమార్‌పై కేసు నమోదు .కూన రవికుమార్‌పై పోలీసులు 353, 506, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు .శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలో పోలీసులు తనిఖీలు.అజ్ఞాతంలోకి వెళ్లిన కూన రవికుమార్.
* చేబ్రోలు మండలం గొడవర్రు కు చెందిన కాకని సురేష్(22) అనే విద్యార్థి ఆత్మహత్య. బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నా సురేష్.
* ఆలూరులో అమానూషం…గోవా నుంచి వచ్చిన గర్భిణికి కాన్పు చేసేందుకు వైద్యుల నిరాకరణ.ఇటీవలే గోవా నుంచి సొంతూరుకు వచ్చిన గర్భిణి..గత 10 రోజులుగా హాలహర్వి క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు.పురుటి నొప్పులు వచ్చిన ఆస్పత్రికి తరలించని అధికారులు..బైక్‌పైనే ఆలూరి ఆస్పత్రికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు…క్వారంటైన్ నుంచి తీసుకొచ్చారని కాన్పు చేయడాని నిరాకరించిన వైద్యులు.