మీ వయస్సు నలభై (40) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 40 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే..
?ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు..
?రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4. పిండిపదార్థాలు
?మూడో సూత్రం.. ఈ నాలుగింటిని ఎక్కువ తీసుకోండి. 1. ఆకుకూరలు, 2. కూరగాయలు, 3. పండ్లు, 4. గింజలు
?నాలుగో సూత్రం.. ఈ మూడింటిని మరచిపొండి. 1. మీ వయస్సు, 2. గడిచిపోయిన రోజులు,
3. కోపతాపాలు
?ఐదో సూత్రం ..ఈ మూడింటినీ పొందుటకు చూడండి. 1. ప్రాణ స్నేహితులు, 2. ప్రేమించే కుటుంబం, 3. ఉన్నతమైన ఆలోచనలు
?ఆరో సూత్రం .. ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ క్రింది వాటిని పాటించండి. 1. నియమిత ఉపవాసం, 2. నవ్వడం, 3. వ్యాయామం, 4. బరువు తగ్గుట
?ఏడో సూత్రం.. ఈ మూడు విషయాలకై ఎదురు చూడకండి.
1. నిద్ర పోవడానికై నిద్ర వచ్చేవరకు కాచుకొని ఉండకండి.
2. విశ్రాంతి తీసుకోవడానికై అలసిపోయే వరకు ఉండకండి.
3. స్నేహితుడిని కలవడానికై అతను ఎదురుచూడడం మానేసేంత ఆలస్యం చేయకండి.