Movies

నన్ను సంప్రదిస్తున్నారు

Yami gautam on digital medium producers and web series

‘‘మళ్లీ చిత్రీకరణలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియడం లేదు. కరోనా ప్రభావం చిత్రసీమపై తీవ్రంగా ఉంది. ఇప్పుడు చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా నిర్మాణ వ్యయాలు తగ్గుతాయ్‌’’ అని యామీ గౌతమ్‌ అన్నారు. దర్శక, నిర్మాతలు నిర్మాణ వ్యయాలపై పునరాలోచించుకుంటారని ఆమె అభిప్రాయపడ్డారు. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని ఈ తరుణంలో డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్స్‌ కోసం తీసే చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ వైపు చాలామంది చూస్తున్నారని ఆమె తెలిపారు. యామీ గౌతమ్‌ మాట్లాడుతూ ‘‘మార్పు మొదలైంది. డిజిటల్‌ మీడియమ్స్‌ కోసం సినిమా తీస్తున్నామనే ప్రతిపాదనతో నన్ను సంప్రదిస్తున్నారు’’ అన్నారు.