కొవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి ప్లాస్మాను సేకరించి అర్హులైన కొవిడ్ రోగులకు ఎక్కించేలా తిరుపతిలోని స్విమ్స్‌కు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.
ఈమేరకు వైద్యారోగ్యశాఖ ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఆస్పత్రుల్లో ప్లాస్మాను సేకరిస్తోంది.
తిరుపతి స్విమ్స్‌లో 58 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని, వారిలో ఇద్దరు రోగులకు ప్లాస్మా చికిత్స అవసరమని గుర్తించినట్లు స్విమ్స్ సంచాలకురాలు వెంగమ్మ తెలిపారు.
త్వరలో వారికి ప్లాస్మా థెరపీ చికిత్స ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు.