Kids

JEE-Main హాల్‌టికెట్ల విడుదల

JEE-Mains & NEET Exam Hall Tickets Released

జేఈఈ-మెయిన్‌, నీట్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు (అడ్మిట్‌ కార్టు), పరీక్షా సమయాలకు సంబంధించిన వివరాల్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆదివారం ప్రకటించింది.

జేఈఈ-మెయిన్‌, నీట్‌ అప్టికేషన్లలో సవరణలు చేసేందుకు మే 31 వరకు అవకాశం కల్పించింది.   

జేఈఈ-మెయిన్‌ హాల్ టికెట్లు జులై మొదటి వారంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష జులై 18 నుంచి 23వ తేదీ(మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) మధ్యలో నిర్వహించనున్నారు.

నీట్ హాల్ టికెట్లు జులై 11న డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

నీట్ ఎగ్జామ్ జులై 26న(ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) నిర్వహించనున్నారు.