NRI-NRT

తానా ప్రపంచ సాహిత్య వేదికకు శ్రీకారం

TANA Begins Global Literary Platform Prapancha Sahitya Vedika - Thotakura Prasad

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, పరివ్యాప్తిలో తానా మరో ముందడుగు వేస్తోంది. ఈ ఆదివారం (31వ తేదీన) అంతర్జాలంలో “తానా ప్రపంచ సాహిత్య వేదిక”ను ప్రారంభిస్తున్నామని అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.

తానా తరఫున మాజీ అధ్యక్షుడు డా.తోటకూర ప్రసాద్ ఈ వేదికకు సమన్వయకర్తగా వ్యవహరిస్తారని జయశేఖర్ పేర్కొన్నారు. డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ద్వారా అంతర్జాతీయ స్థాయిలో సాహిత్య సభలు, సమావేశాలు, కవిసమ్మేళనాలు, చర్చలు, అవధానాలతో పాటు కథలు, కవితలు, ఫోటో కవితలు, పద్యాలు, పాటలు, బాలసాహిత్యం వంటి వివిధ అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా పోటీలు నిర్వహిస్తామని, ప్రతి నెలా చివరి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో నిర్వహిస్తామని, దీనిలో ఏ దేశానికి చెందిన ప్రవాసులైనా ఉత్సాహంగా పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు.

31వ తేదీన ప్రథమ సమావేశం అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 11గంటలకు, భారతదేశంలో రాత్రి 930గంటలకు ప్రారంభమవుతుందని, దీన్ని ప్రవాసులు, తెలుగు భాషాభిమానులు సద్వినియోగం చేసుకోవల్సిందిగా వారు సంయుక్తంగా కోరారు. వివరాలు దిగువ చూడవచ్చు.

ఈ ఆదివారం జరిగే కార్యక్రమ ముఖ్య అతిథి ప్రముఖ జానపద ప్రజా వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు తన బృంద సభ్యులతో జానపద గానాలతో కనువిందు చేస్తారు.

1. Webex Link: https://tana.webex.com/tana/j.php?MTID=md6320421e1988f9266591b0ce5f8ee40

2. Join by phone:
USA: 1-408-418-9388
Access code: 798 876 407

మిగిలిన వివరాలకు www.tana.org ను సందర్శించండి