లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా స్తంభించిపోయిన దేశీయ విమానయాన కార్యకలాపాలు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. రైళ్లు, బస్సుల పాక్షిక సేవలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రయాణ, పర్యాటక రంగం మళ్లీ చిగురు తొడుగుతున్న తరుణంలో విడుదలైన ఓ నివేదిక మాత్రం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈ రంగానికి చెందిన 40 శాతం కంపెనీలు వచ్చే 3-6 నెలల్లో శాశ్వతంగా మూతపడవచ్చని హెచ్చరించింది. అంతేకాదు, 36 శాతం కంపెనీలు తాత్కాలికంగా షట్‌డౌన్ అయ్యే ప్రమాదం ఉందంటోంది. ఐఏటీఓ, టీఏఏఐ, ఏడీటీఓఐ, ఓటీఓఏఐ, ఏటీఓఏఐ, ఎస్‌ఐటీఈ వంటి ఏడు జాతీయ సంఘాల భాగస్వామ్యంతో విడుదల చేసిన బీఓటీటీ ‘ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్’ రిపోర్టు ఈ విషయాల్ని వెల్లడించింది.2,300 మంది ప్రయాణ, పర్యాటక కంపెనీల ప్రతినిధులు, యజమానులను 10 రోజులపాటు ఆన్‌లైన్‌లో సర్వే చేసింది. ‘దేశీయ ప్రయాణ, పర్యాటక రంగం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. కరోనా వ్యాప్తితో ఇండస్ట్రీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది ప్రజలు భారీ నష్టాలు, ఉద్యోగాల కోతలను చవిచూడాల్సి వచ్చింద’ని రిపోర్టు పేర్కొంది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
**కంపెనీలు పర్యవసానాలు/నిర్ణయాలు
81% రాబడి 100 శాతం వరకు క్షీణత
15% ఆదాయం 75 శాతం వరకు తగ్గుదల
39% ఉద్యోగుల తొలగింపు
38% సిబ్బందిని తొలగించే ఆలోచన
73% జీతాల్లో కోత, వేతనాల వాయిదా, కాంట్రాక్టుల రద్దు వంటి సర్దుబాట్లు
67% వ్యాపార నిర్వహణ వ్యయాలు తగ్గింపు
49% మూలధన వ్యయాల వాయిదా
42% కొత్త సేవల ప్రారంభం ప్రభుత్వ ఊరట కోరుతున్న కంపెనీలు
78.6% ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి
68.2% ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లకు ఎయిర్‌లైన్స్ నుంచి టిక్కెట్ల రద్దు, అడ్వాన్సుల రిఫండ్ ఇప్పించాలి
67.7% జీఎస్‌టీని 5 శాతం మేర తగ్గించాలి
54.2% టర్మ్ రుణాల చెల్లింపులపై ఏడాది పాటు మారటోరియం
49.3% టీడీఎస్ డిపాజిట్ ఏడాది పాటు వాయిదా
పర్యాటక రంగం కుదేలు
Related tags :