మనోరమ (మే 26, 1937 – అక్టోబరు 11, 2015) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించింది. ఈమె కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి (Aachi) అని ప్రేమగా పిలుస్తారు.
1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం జయలలిత, మాజీ సీఎంలు అణ్ణా దురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధితో పాటు నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు.
ఇక ప్రముఖ హీరోలైన శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం సింగం-2.