ScienceAndTech

ఐటీ అబ్బాయిల వెకిలి చేష్టలు

Hyderabadi IT Professionals Blackmailing Female Colleagues

ఓ ఐటీ ఉద్యోగి.. స్నేహితురాలికి ఫోన్‌ చేసి.. జాబ్‌ ఎలా ఉన్నదని పలుకరించాడు.. నేను లాక్‌డౌన్‌తో వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తు న్నా.. నీకు ఓ పెద్ద కంపెనీ డైరెక్టర్‌ వద్ద పీఏగా ఉద్యోగం ఇప్పిస్తాను.. భారీ ప్యాకేజీ ఉంటుందన్నాడు.. సదరు యువతి స్నేహితుడే కదా అని నమ్మింది. ఈ క్రమంలో ఆ ఉద్యోగి ఫొటోలు దిగి పంపించమని అడుగగా పంపించింది.. భారీ ప్యాకేజీ కావాలంటే కొంచం సెక్సీగా ఉండాలని చెప్పగా.. యువతి సెక్సీ లుక్స్‌ ఉండే ఫొటోలు దిగి పంపింది. నీ ఫొటోలు బాగున్నాయి.. డైరెక్టర్‌తో కెమెస్ట్రీ కుదరాలంటే లైంగికంగా కలవాలని కంపెనీవారు రిఫ్లై పంపించారని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా సదరు యువతి షాక్‌కు గురై.. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని అడిగింది. వెంటనే ఐటీ ఉద్యోగి.. నా లైంగిక కోరిక తీరుస్తావా? లేదా? లేకపోతే.. నీ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తానని బెదిరించాడు. దీంతో సదరు యువతి ఆందోళనకు గురై.. భయాందోళన చెంది.. చివరికి షీటీమ్స్‌ను ఆశ్రయించింది. ఇలా.. వర్క్‌ ఫ్రం హోమ్‌ ముసుగులో కొందరు ఐటీ ఉద్యోగులు యువతులను నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ఈ వారంలో మొ త్తం 10 మంది ఉద్యోగినులు.. ఇలాంటి మోసగాళ్లబారినపడి షీటీమ్స్‌ను ఆశ్రయించారు. తమ బాధలను తీర్చాలని కన్నీరు పెట్టుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సైబరాబాద్‌ షీ టీమ్స్‌ బృందం.. 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నది. వారి ఫోన్‌, సోషల్‌ మీడియాలో దాచిన ఫొటోలను డిలీట్‌ చేయించారు. ఇంకెప్పుడైనా ఇలా బ్లాక్‌మెయిల్‌ చేస్తే జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుందని హెచ్చరించి.. కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.