NRI-NRT

హైదరాబాద్‌లో 500మంది నిరుపేదలకు నాట్స్ సాయం

NATS Helps 500 Poor People In Hyderabad

హైదరాబాద్‌లోని హబ్సీగూడ, నాచారం, కాకతీయ నగర్, తార్నాక ప్రాంతాల్లో నివశిస్తున్న నిరుపేదలైన ఇంటి పని వాళ్లు, ఆటో కార్మికులు, వాచ్మెన్స్, చిన్న చిన్న వృత్తి పనులు చేసుకునే చేనేత కార్మికులు, మత్స్యకారులు, రజకులు, నాయి బ్రాహ్మణులు తదితర 500 నిరుపేద కుటుంబాలకు నాట్స్ చేయూతనిచ్చింది. వారికి కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసింది. నాట్స్ ఉపాధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి దృష్టికి తీసుకురావడంతో ఆయన స్పందించి నిరుపేదలకు కావాల్సిన నిత్యావసరాలను పంపిణీ చేసేందుకు కావాల్సిన సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ళ ఆశయ్య, నానాపురం శివరాజ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆర్.వి.ఎస్ కార్యదర్శి జ్యోతి ఉపేందర్, జి నరేష్ పద్మ, నిర్మల, రేణుక సర్దార్ అశోక్, శ్రీనివాస్ పరమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.