* బోరుబావిలో పడ్డ మూడేళ్ళ బాలుడు.పాపంపేట మండలం పూడ్చానపల్లిలో ఘటన.పంటపొలం కోసం తొవ్విన బోర్ బావిలో పడ్డ హర్షవర్ధన్.ఆందోళనలో కుటుంబసభ్యులు.
* గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో సెల్ టవర్ ఎక్కి దొంతు బోయిన గోపి అనే యువకుడు హల్ చల్
* పెండ్లిమర్రి మండలంలో ఇసుకరీచ్లపై ఏఎస్పి చక్రవర్తి సమావేశం. అక్రమ ఇసుకపై ఉక్కపాదం మోపుతామన్న ఎఎస్పి.
* శెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో ముత్తురాశి ఈరన్న(30)పై అన్నకొడుకు శంకర్ మంచు కొడవళితో అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా దాడి పరిస్థితి విషమం అనంతపురం ఆసుపత్రికి తరలింపు.
* నందిగామ శివారులో బైక్ ను డికొట్టిన ఓల్వో బస్సు! అక్కడిక్కడే వ్యక్తి మృతి! తప్పించుకొని వెళ్తున్న ఓల్వో బస్సును పట్టుకొని డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న షాద్ నగర్ పోలీసులు!
* కంబదూరు…. మండక పరిధిలోని మేళ్లకుంట గ్రామానికి చెందిన కమ్మ రామాంజినేయులు అనునతడు గత అర్ధరాత్రి సమయంలో తన పొలం నందు నిద్రిస్తుండగా ఎలుగుబంటి దాడి చేసి గాయపర్చిన్నట్లు బాధిత రైతు తెలిపాడని స్టాప్ నర్స్ రాధాబాయి బుధవారం తెలిపారు.
* లాక్‌డౌన్ అనంతరం పరిశ్రమల్లో తిరిగి పనులు ప్రారంభమవుతున్న వేళ ఇటీవల పలు చోట్ల గ్యాస్ లీకేజీ ఘటనలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలం వేమవరంలో ఈ రోజు ఉదయం ఓ చోట గ్యాస్ లీకేజీ కావడం అలజడి రేపింది. వేమవరంలో ఓ బోర్‌కు సిబ్బంది మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీక్ అయింది.అదే సమయంలో భారీ శబ్దాలు వచ్చాయి. దీంతో గ్రామస్థులంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అధికారులు గ్రామస్థులను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
* శ్రీకాకుళం టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ అజ్ఞాతాన్ని వీడారు. ఈ రోజు ఉదయం ఆయన టీడీపీ నాయకులు వెంటరాగా శ్రీకాకుళం జిల్లా పొందూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. పొందూరు తహసీల్దారు రామకృష్ణను దూషించిన కేసులో ఆయన నిందితుడు.తనను అసభ్య పదజాలంతో రవికుమార్ దూషించి, బెదిరించారంటూ పోలీసులకు తహసీల్దారు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తర్వాత ఆయనను అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లేటప్పటికి ఆయన ఇంట్లో లేరు. ఈ క్రమంలో మూడు రోజులుగా ఆయన అజ్ఞాతంలో వున్నారు. పోలీసులు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తున్న నేపథ్యంలో రవికుమార్ ఈ రోజు పోలీసులకు స్వయంగా లొంగిపోవడం జరిగింది.
* పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ లో పోలీస్ కస్టడీ లో ఉన్న వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.
* టీడీపీ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ దాఖలైన పిల్ ను ఈరోజు ఏపీ హైకోర్టు విచారించింది. దీనికి సంబంధించిన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారా? అని ఫిర్యాదుదారును హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసునే హైకోర్టు ఇప్పటికే స్వీకరించిందనే విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో, ఆ ఐదుగురు ఎమ్మెల్యేల కేసుతో పాటు చంద్రబాబు కేసును కూడా రేపు విచారిస్తామని తెలిపింది.దాదాపు రెండు నెలల తర్వాత చంద్రబాబు ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికాయి. జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఆయనకు టీడీపీ జెండాలతో స్వాగతం పలికారు. దీంతో లాక్ డౌన్ నిబంధనలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ ఆయనపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
* కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి చెందిన జనసేన కార్యకర్త బొమ్మదేవర చక్రి ఈ ఉదయం కొండపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. నిస్వార్థ జనసైనికుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. చక్రి మరణం చాలా బాధాకరమని తెలిపారు. బాధాతప్త హృదయంతో చక్రికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నామని… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు పవన్ ట్వీట్ చేశారు.