సహజ రుచులకు మెల్లమెల్లగా దూరమవుతున్న మనం.. కృత్రిమ రచులకు అలవాటుపడి చాలా త్వరగా కొత్తకొత్త వ్యాధులకు దగ్గరవుతున్నాం. అలాంటి వాటిలో చక్కెర ఒకటి. ఈ తీయని శత్రువు నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత ఎక్కువ కాలం బతుకుతాం. గతంలో చెరుకు రసం నుంచి చక్కెర నేరుగా తీసి ముడి రూపంలో వాడేవారు. అయితే ప్రస్తుతం వాణిజ్యపరంగా దొరుకుతున్న చక్కెర చాలా వరకు రసాయన ప్రక్రియలకు గురై శుద్ధి అవుతుంది. ఈ శుద్దీకరణ ప్రక్రియ దాదాపు చక్కెరలోని అన్ని విటమిన్లను, ఖనిజాలను తొలగించి పోషక విలువలను నాశనం చేస్తున్నది. పళ్ళు, కూరగాయలు పాల ఉత్పత్తుల్లో సహజంగా లభ్యమయ్యే చక్కెర, విడి చక్కెరకూ మధ్య తేడా చాలా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.అధిక మోతాదులో చక్కెరలు తీసుకోవడం ద్వారా రక్తనాళాలు గట్టిపడడాన్నితీవ్రం చేస్తుంది. మధుమేహ వ్యాధి నియంత్రణను కష్టతరం చేస్తుంది. అలాగే పోషక లోపాలను కలుగజేస్తుంది. శీతల పానీయాలు, రొట్టెలు, కుకీలు, మిఠాయి బార్లు, సిరప్లు, జామ్‌లు, జెల్లీలు.. ఇవన్నీ చక్కెరలను కలిగివుంటాయి. అలాగే, సలాడ్ డ్రెస్సింగ్, రుచి యోగర్ట్, వోట్మీల్, ఫ్రూట్ స్మూతీస్ వంటి ఇతర ఆహారాలు కూడా చక్కెరలను కలిగి ఉంటాయి. ప్యాకింగ్లలో లభించే పండ్లు, పండ్ల రసాల్లో కూడా చక్కెరలు దాగి ఉంటాయి. ఒక్క కప్పు ప్యాకేజ్డ్ ఫ్రూట్స్‌లో కనీసం 39 గ్రాముల చక్కెరలను కలిగి ఉంటుంది. క్యాబేజీతో సర్వ్ చేసే సలాడ్‌పై వేసే కోడిగుడ్డు సొన, వెనిగర్‌తో కలిపిన క్రీమ్‌లో కూడా చక్కెర దాగుంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ రకాల టీలలో కూడా చక్కెరలు ఉంటాయి. కప్పు ఐస్టీలో 32 గ్రాముల చక్కెరలను కలిగి ఉంటుంది. వివిధ డ్రై ఫ్రూట్స్లలో కూడా చక్కెరలు దాగి ఉంటాయి. చక్కెరలకు బదులుగా అన్ని రకాల పోషకాలు, విటమిన్లను కలిగివుండే బెల్లంన, తేనెన తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి జీర్ణ వ్యవస్థ మెరుగుదలతోపాటు వివిధ రకాల వ్యాధుల నివారణలో కూడా సహాయపడతాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రూపంలో చక్కెరలు తీసుకొని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకోకుండా చూసుకోవడం ఉత్తమం.
ఈ ఆహారాల్లో చక్కెర చూసుకోండి
Related tags :