లాక్ డౌన్ కారణంగా వెంకన్న దర్శనానికి దూరమైన భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. స్వామి వారి ఆశీస్సులు అందరికీ అందిచాలన్న లక్ష్యంతో లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
రూ. 25కే రాయితీ లడ్డూలను అన్ని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణ మండపాల్లో విక్రయిస్తున్నారు.
అటు ప్రత్యేక ఆర్డర్‌పై స్వామివారి లడ్డూలు ఎంత మొత్తంలో కావాలన్నా.. పంపిణీ చేస్తామని టీటీడీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీనికి భక్తుల నుంచి విశేష స్పందన రావడంతో ఇకపై లడ్డూలను ఆన్లైన్ ద్వారా అమ్మకాలు జరపాలని టీటీడీ నిర్ణయించింది.
ఆన్‌లైన్‌లో లడ్డూలు ఆర్డర్ చేసేవాళ్లు.. వాటిని తమకు దగ్గరలోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కళ్యాణ మండపాల నుంచి సేకరించే సదుపాయాన్ని కల్పించింది.